Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు

Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు

అరుణాచలం లేదాఅన్నమలై” తమిళనాడు రాష్ట్రంలో ఉంది. Arunachalam Giri Pradhakshina అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు అరుణాచలం గిరి ప్రదక్షిణ మహత్యంఅరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్ని భూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను హరించినది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మంత్రం చేతనే ముక్తిని ఇచ్చే క్షేత్రం.

అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు | Arunachalam Giri Pradhakshina:

Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు
Arunachalam Giri Pradhakshina

చెన్నై నుండి దూరం:

అరుణాచలం చెన్నై పట్టణానికి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది, చెన్నై నుంచి బస్సు సౌకర్యం, ట్రైన్ సౌకర్యం కలదు. చెన్నై లోని కోయంబేడు (సి.యమ్.బి.టి.) బస్సు నిలయం నుండి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది.

హైదరాబాద్ నుండి దూరం:

హైదరాబాదు కాచిగూడ నుండి అన్నమలై వరకు మనకు చాలా స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది, స్లీపర్ క్లాస్ టికెట్ 450rs/-. శనివారం మధ్యాహ్నం వరకు మనం తిరుమలై లో ఉంటాం, అక్కడ రూమ్స్, హోటల్స్, ఆశ్రమాలు దొరుకుతాయి.

తిరుపతి నుండి దూరం:

తిరుపతి నుంచి మనార్గుడి వెళ్తుంది ఈ ట్రైన్ పేరు పామని ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17047.

గిరిప్రదక్షిణం

అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో.. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువాన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.

గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి.

గిరిప్రదక్షిణ నియమాలు జాగ్రత్తలు:

  • గిరి ప్రదక్షిణం చేసే వారు కచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్లాలి.
  • బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకండి.
  • గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.
  • ఉదయం పూట గిరి ప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
  • గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
  • అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తల పైన టోపీ లాంటివి ధరించకూడదు.
  • అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి.
  • గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి.
  • ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము అనేది కాకుండా, నిండు గర్భిణి వలే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
  • గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి.
Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు

6 thoughts on “Arunachalam Giri Pradhakshina | అరుణాచలంలో గిరి ప్రదక్షిణం విశేషాలు

Comments are closed.